
అర్హులందరికీ రేషన్ కార్డులు
భానుపురి (సూర్యాపేట) : రేషన్ కార్డులు రానివారు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ అందజేస్తామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డితో కలిసి ఆయన సూర్యాపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా హుజూర్‌నగర్ నుంచి సన్న బియ్యం, తిరుమలగిరి నుంచి నూతన్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం మన జిల్లా అదృష్టమని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 32,274 నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా కొత్తగా 95,309 మందికి సన్న బియ్యం పొందే హక్కు లభించిందన్నారు.
పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నం
: పటేల్ రమేష్‌రెడ్డి
పేదవారి ఆత్మ గౌరవానికి రేషన్ కార్డులు చిహ్నం అని తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. మన జిల్లా నుంచే సన్నబియ్యం పంపిణీ, నూతన్ రేషన్ కార్డులు మంజూరు చేసినందుకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. దేశంలోని ఏ నాయకుడికి రాని ఆలోచన ముఖ్యమంత్రి, మంత్రికి రావడం వారి గొప్పతనం అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్ది, వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, డీఎస్‌ఓ మోహన్‌బాబు, తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
అర్హులందరికీ కార్డులు ఇవ్వడం సంతోషకరం : ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి
సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన వారందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వడం, అలాగే సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషమన్నారు.