
బేస్‌మెంట్, పిల్లర్ల దశలో పనులు
నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీకి అమృత్ 2.0 పనుల నిమిత్తం రూ.11 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలోని మూడు ప్రాంతాలైన పద్మావతి వెంచర్ వద్ద నిర్మించే వాటర్ ట్యాంకు ప్రస్తుతం బేస్మెంట్ లెవల్‌లో పనులు జరుగుతున్నాయి. ఎస్‌కేఎస్ ఫంక్షన్‌హాల్ వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు పిల్లర్ల దశలో ఉంది. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో వాటర్ ట్యాంకు రూఫ్ లెవల్‌లో ఉంది. ఈ మూడు ట్యాంకులకు పైపులైన్లు ఐదు కిలో మీటర్ల మేరకు పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు. మూడు వాటర్ ట్యాంకుల నుంచి మున్సిపాలిటీలోని 15 వార్డులకు నీటిని అందించేందుకు ఈ పనులు చేపడుతున్నారు. వీటి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటిని అందించనున్నారు. అదే విధంగా మురుగునీటి శుద్ధి(ఎస్‌టీపీ) ప్లాంటు, చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు అయినప్పటికీ టెండర్లు పూర్తికాకపోవడంతో పనులు నేటికీ ప్రారంభం కాలేదు.