
నేడు ప్రజావాణి లేదు
భానుపురి (సూర్యాపేట) : బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించినందున సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం ఉండదని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు.
ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రైవేట్ టీచర్లుకు, లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం (టీపీటీఎల్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుతాన్ని కోరారు. ఆదివారం తిరుమలగిరిలో ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవకాశం కల్పించాలన్నారు. ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు కల్పించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆ ఫోరం జిల్లా అధ్యక్షుడు జె.నర్సింహారావు, మండల అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బండారి కిరణ్, కోశాధికారి ధరావత్ భిక్షం, గౌరవ అధ్యక్షుడు పాలబిందెల శేఖర్, సహాయ కార్యదర్శి జి.వెంకన్న, బి.భిక్షం,
వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘దొడ్డా’ సంతాప సభ
చిలుకూరు: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎంపీపీ దొడ్డా నారా యణరావు సంతాప సభ సోమవారం చిలుకూరులోని జరగనుందని సీపీఐ నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నారాయణరావు శిలాఫలకాన్ని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆవిష్కరించనున్నారని పేర్కొన్నారు. ఈ సంతాప సభకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదా డ ఎమ్మెల్యే పద్మావతి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం ఎమ్మెల్యే కూనంనేని సాంశివరావు తదితరులు హాజరుకానున్నారని తెలిపారు.
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ప్రభు త్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకనామిక్స్ 1, కామర్స్ 2, బాటనీ 1, మైక్రోబయాలజీ 1, జువాలజీ 3, ఫిజిక్స్ 3, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్ 6, హిందీ 1, తెలుగు 4, హిస్టరీ (ఉర్దూ) 1, పోలిటికల్ సైన్స్ (ఉర్దూ) 1 సబ్జెక్టులు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత పీజీలో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు అభ్యర్థులు 50 శాతం మార్కులు ఉండాలని తెలిపారు. పీహెచ్‌డీ, నెట్, సెట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని, ఈ నెల 22 నుంచి 25 వరకు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 98490 00244, 94409 12000 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

నేడు ప్రజావాణి లేదు