శ్రమిస్తే.. విజయం సొంతం | - | Sakshi
Sakshi News home page

శ్రమిస్తే.. విజయం సొంతం

Jul 21 2025 6:11 AM | Updated on Jul 21 2025 6:11 AM

శ్రమి

శ్రమిస్తే.. విజయం సొంతం

పాఠశాల స్థాయి నుంచే సివిల్స్‌పై ఆసక్తి పెంచుకున్న

ఉన్నతాధికారిగా సేవలందించాలనే తపన

స్వతహాగానే సివిల్స్‌కు ప్రిపరేషన్‌

యువత ఉన్నత ఆశయాలు కలిగి ఉండాలి

భూవివాదాల్లో పోలీసుల జోక్యం సహించను

డ్రగ్స్‌ నివారణకు అవగాహన సదస్సులు

భువనగిరి డీసీపీ అక్షాంశ్‌యాదవ్‌

మాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా. మా నాన్న అజాబ్‌సింగ్‌ యాదవ్‌. ఆగ్రా యూనివర్సిటీలో జాగ్రఫీ ప్రొఫెసర్‌. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచే ఉన్నత చదువులపై నాకు ఆసక్తి పెరిగింది. సివిల్‌ సర్వీస్‌ పరీక్ష రాయాలని పాఠశాల స్థాయి నుంచే ఆలోచన ఉంది. నాకు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటీవలే నాకు వివాహమైంది. నా భార్య రోష్నీ స్వస్థలం ఢిల్లీ. ఆమె రిపబ్లిక్‌ టీవీలో ఉద్యోగం చేస్తున్నారు.

గ్రేహౌండ్స్‌లో మొదటి పోస్టింగ్‌

ఐపీఎస్‌ శిక్షణ పూర్తయిన తర్వాత నన్ను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించారు. ఆదిలాబాద్‌లో ట్రైనీ అధికారిగా కొన్ని రోజులు పనిచేశాను. భద్రాచలంలో గ్రేహౌండ్స్‌ ఏఎస్పీగా తొలిసారిగా విధుల్లో చేరాను. అక్కడ ఏడాది పని చేసిన తర్వాత అప్పటి గవర్నర్‌ తమిళిసై వద్ద ఏడీసీగా పనిచేశాను. పది నెలల తర్వాత హైదరాబాద్‌ సిటీ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా పనిచేశాను. నేను అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సినీ హీరో అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్‌ సందర్శన, తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ సంవత్సరం మార్చిలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని భువనగిరి జోన్‌ డీసీపీగా వచ్చాను.

ప్రజలు తమ సమస్యలను పోలీస్‌ శాఖ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తాను. ఇక్కడి ప్రజలు సహృదయులు. అన్ని విధాలా పోలీస్‌ శాఖకు సహకరిస్తారు. పోలీస్‌ స్టేషన్‌లలో ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లపై నిఘా పెట్టాం. సివిల్‌ మ్యాటర్‌లో జోక్యం చేసుకోవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చాం. జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ ముమ్మరం చేశాం. రోడ్డు యాక్సిడెంట్లను నిరోధించడం, డ్రగ్స్‌ నివారణకు అవగాహన చర్యలు చేపట్టడం, కార్డన్‌ సెర్చ్‌, నాకాబంది నిర్వహిస్తున్నాం. మహిళలపై జరుగుతున్న దాడుల కేసులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. సీసీ కెమెరాలు, కమ్యూనిటీ పోలీసింగ్‌, జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసుల నమోదుకు ప్రాధాన్యత ఇస్తున్నాం.

యూత్‌ గోల్‌ ఇదే..

యువత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తే తప్పక విజయం లభిస్తుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. సమాజంలో ఉత్తమ సిటిజన్‌గా ఎదగాలి. ఆడపిల్లలను గౌరవించాలి. మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.

కోచింగ్‌కు

వెళ్లకుండానే..

ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్‌ చదివాను. 2015లో డిగ్రీ పూర్తి కాగానే జాగ్రఫీలో పీజీ చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యాను. కోచింగ్‌కు వెళ్లకుండానే స్వతహాగానే ప్రిపేర్‌ అయ్యాను. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రూపొందించిన బుక్స్‌ చదివి నోట్స్‌ తయారు చేసుకున్నా. పుస్తక పఠనం సివిల్స్‌ సాఽధించడానికి నాకు ఎంతగానో తోడ్పడింది. జాగ్రఫీతో పాటు సివిల్స్‌కు అవసరమయ్యే పుస్తకాలు చదివాను. తొలి ప్రయత్నంలో 2017లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కానీ, సక్సెస్‌ కాలేకపోయాను. రెండవసారి ప్రయత్నం చేశాను. 2019లో సివిల్స్‌ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాను.

ఇక్కడి ప్రజలు

సహృదయులు

శ్రమిస్తే.. విజయం సొంతం1
1/4

శ్రమిస్తే.. విజయం సొంతం

శ్రమిస్తే.. విజయం సొంతం2
2/4

శ్రమిస్తే.. విజయం సొంతం

శ్రమిస్తే.. విజయం సొంతం3
3/4

శ్రమిస్తే.. విజయం సొంతం

శ్రమిస్తే.. విజయం సొంతం4
4/4

శ్రమిస్తే.. విజయం సొంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement