
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: నిత్యారాధనలు, భక్తజనులతో ఆదివారం యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ప్రభాతవేళ స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. ఆ తరువాత గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళాలతో అర్చించారు. ఇక ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. అదే విధంగా ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు, సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వారబంధనం చేశారు.

యాదగిరి క్షేత్రంలో కోలాహలం