
మూసీకి 866 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి : ఎగువన వర్షాలు కురుస్తుండటంతో మూసీ ప్రాజెక్టుకు ఆదివారం ఇన్‌ఫ్లో పెరిగింది. శనివారం సాయంత్రం మూసీ రిజర్వాయర్‌కు 243 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో ఆదివారానికి 866 క్యూసెక్కులకు పెరిగింది. మూసీ ప్రాజెకు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 641.50 అడుగులకు చేరుకుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు పేర్కున్నారు. వానాకాలం పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 231 క్యూసెక్కుల చొప్పున మొత్తం 462 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్‌ఫ్లో ప్రారంభం కావడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.