
గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
సూర్యాపేట : పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని రిటైర్డ్ సీనియర్ సివిల్ జడ్జి డి.నరసింహాచార్యులు అన్నా రు. గ్రీన్‌వాక్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట మండలం కుప్పిరెడ్డిగూడెంలో ఆదివారం నిర్వహించిన చేతి సంచుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ ప్రతిఒ క్కరూ ప్రకృతిని గౌరవిస్తూ గాలి, నీరు ఆహారాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవాలన్నారు. పనస వసంత్ సహకారంతో ఇంటింటికి చేతి సంచులు అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ శేషగాని శ్రీనివాస్ గౌడ్, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సలహాదారులు జె.శశిధర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తోట కిరణ్, కార్యవర్గ సభ్యులు గుండా కిరణ్,తల్లాడ రామచంద్రయ్య, సోమా హేమమాలిని, బహురోజు ఉపేంద్రచారి, రావిరాల సురేందర్, కొత్త మల్లికార్జున్, నెల్లుట్ల వెంకట్, విజయలక్ష్మి, డాక్టర్ అలేఖ్య, తోట స్వాతి, టీచర్‌లు నిర్మల, విజయ పాల్గొన్నారు.