
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
సంస్థాన్ నారాయణపురం: ఎదరుగా వస్తున్న డీసీఎంను తప్పింబోయి ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ అటవీ ప్రాంతంలోని కడిలబావితండాలో సోమవారం జరిగింది. పోలీసులు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం పీపుల్‌పహాడ్ గ్రామానికి చెందిన దండుగుల రంజిత్ (32) కంప్రెషర్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కంప్రెషర్ పని నిమిత్తం ట్రాక్టర్‌ను తీసుకొని సోమవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి వెళ్తుండగా.. రాచకొండ ప్రాంతంలో కడీలబావితండా పరిధిలో మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎంను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలో ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రంజిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగన్ తెలిపారు రంజిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బోరు బండి పైనుంచి పడి..
రామగిరి(నల్లగొండ): బోరు బండి పైనుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన నల్ల గొండ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రగిరి విలా స్‌లో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ కకాడియా బోర్ బండి మీద కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రగిరి విలాస్‌లో బోర్ వేసిన అనంతరం ఒంటిపై ఉన్న దుమ్మును శుభ్రం చేసుకునే క్రమంలో విశాల్ వర్కాడే అనే వ్యక్తి ఎయిర్ పైపును అనిల్ కకాడియా వెనుక నుంచి పెట్టగా అతడు ప్రమాదవశాత్తు బోర్ బండి పైనుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అనిల్ కకాడియాను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అన్ను వార్కడే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు.