
ఫ విశేషాలంకరణలో భక్తాంజనేయస్వామి
అదనపు ఎస్పీగా
రవీందర్‌రెడ్డి
సూర్యాపేటటౌన్ : హైదరాబాద్ సీసీఎస్‌లో అడిషనల్ డీసీపీగా పని చేస్తున్న యు.రవీందర్‌రెడ్డిని సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పని చేస్తున్న అదనపు ఎస్పీ ఎం.నాగేశ్వర్‌రావును డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది.
శాంతిభద్రతల పరిరక్షణకు
కృషి చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సూర్యాపేట డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసన్నకుమార్ గురువారం రాత్రి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు మొక్కను బహూకరించారు.
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రాతఃకాలార్చన, సుప్రభాతసేవ, నిత్యాగ్నిహోత్రి, పంచామృతాభిషేకం, అష్టోత్తర, సహస్ర నామార్చనలు, అమ్మవార్లకు సహస్రకుంకుమార్చనలు చేసి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. నీరాజన మంత్ర పుష్పాలతోమహానివేదన చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణమంగాచార్యులు, ఆంజనేయా చార్యులు, వంశీక్రిష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు.
అర్హతలేని డాక్టర్లపై కేసు నమోదు చేయాలి
సూర్యాపేట అర్బన్: వచ్చీరాని వైద్యంతో ప్రాణాలు హరిస్తున్న అర్హత లేని డాక్టర్లపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్‌యు) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది మారపాక వెంకన్న గురువారం ఒక ప్రకటనలో కోరారు. వైద్యం అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఒక ప్రాథమిక హక్కు అని, వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు చట్టం జోక్యం చేసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. విలువైన ప్రాణాలు అర్హత లేని డాక్టర్ల చేతిలో గాలిలో కలుస్తుంటే సంబంధిత శాఖ అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఫ విశేషాలంకరణలో భక్తాంజనేయస్వామి