25వరకు లబి్ధదారుల ఎంపిక పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

25వరకు లబి్ధదారుల ఎంపిక పూర్తి చేయాలి

May 23 2025 3:08 PM | Updated on May 23 2025 3:08 PM

25వరక

25వరకు లబి్ధదారుల ఎంపిక పూర్తి చేయాలి

భానుపురి (సూర్యాపేట) : రాజీవ్‌ యువ వికాస పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈనెల 25 వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ పి. రాంబాబు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్‌, మైనార్టీ కార్పొరేషన్‌, మండల అభివృద్ధి అధికారులతో రాజీవ్‌ యువ వికాస పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటగిరీలవారీగా రిజర్వేషన్‌ నిష్పత్తిని అనుసరించి మండల స్థాయి కమిటీలతో ఎంపిక పూర్తి చేసి జిల్లా స్థాయికి లబ్ధిదారుల జాబితాను అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస్‌ నాయక్‌, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌ రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, డిప్యూటీ సీఈఓ శిరీష, మెప్మా పీడీ రేణుక, మత్స్యశాఖ అధికారి నాగయ్య, డిడబ్ల్యూ ఓ నరసింహారావు, డీటీడీఓ శంకర్‌, మైనార్టీ అధికారి జగదీష్‌ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి అధికారి దయానందరాణి, సర్వే అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, ఎంవీఐ ఆదిత్య, ఆడిట్‌ అధికారి శ్యామ్‌ సుందర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

బ్యాంకర్లు లక్ష్యాలు సాధించాలి

బ్యాంకర్లు వారికి ఇచ్చిన లక్ష్యాలు సాధించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 4వ త్రైమాసికంలో సాధించిన లక్ష్యాలను ఎల్‌డీఎం బాపూజీ వివరించారు. వ్యవసాయ రుణాల్లో గడిచిన 2024–25 సంవత్సరంలో రూ.2242.48 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే రూ.4305.51 కోట్లు లక్ష్యం పూర్తి చేసి 146.32 శాతం వృద్ధి సాధించామన్నారు. అనంతరం 2025–26 వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఐ ఏజీఎం గోమతి, నాబార్డ్‌ డీడీఎం రవీంద్ర నాయక్‌, ఎస్‌బీఐ ఏజీఎం అనిల్‌ కుమార్‌, అన్నిబ్యాంకుల అధికారులు, జిల్లా అనుబంధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

2,89,063 మెట్రిక్‌ టన్నుల

ధాన్యం కొనుగోలు

సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 2,89,063 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. మరో 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉందని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ రాంబాబు, సివిల్‌ సప్లయ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

25వరకు లబి్ధదారుల ఎంపిక పూర్తి చేయాలి1
1/1

25వరకు లబి్ధదారుల ఎంపిక పూర్తి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement