
తొలిరోజు 2,819మంది హాజరు
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 2,819 మంది హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించారు. మొత్తం 2,312 మంది విద్యార్థులకు 198 మంది గైర్హాజరు కాగా 2,114 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్ష మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహించారు. మొత్తం 765 మంది విద్యార్థులకు 60 మంది గైర్హాజరు కాగా 705 మంది హాజరయ్యారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు.
అదనపు కలెక్టర్ తనిఖీ
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని ప్రతిభ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
పరీక్షలు ప్రారంభం