
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మల్లీశ్వరి, సభ్యులు
హుజూర్‌నగర్: ప్రత్యక్షంగా యుద్ధం చేస్తూ గాజాలోకి వెళ్లిన ఇజ్రాయెల్ సైన్యాన్ని వెంటనే వెనక్కి పిలిపించాలని మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లీశ్వరి కోరారు. సమాఖ్య జాతీయ సమితి పిలుపు మేరకు బాలల దినోత్సవం సందర్భంగా ‘కాల్పులు ఆపండి – బాలలను కాపాడండి’ అనే నినాదంతో మంగళవారం హుజూర్‌నగర్‌లోని జంగిడి సెంటర్‌లో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ హమాస్ ఉగ్రవాదులు చర్యకు ప్రతీకారంగా, గాజా పట్టణంపై రాకెట్ దాడులు చేసి వేల మంది మహిళలు, పిల్లలును చంపడం ఘోరమన్నారు. గాజాలోకి వెళ్లిన ఇజ్రాయెల్ సైన్యాన్ని వెంటనే వెనక్కి పిలిపించి, శాంతి నెలకొల్పాలని కోరారు. కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు దేవరం అరుణ, పుల్లమ్మ, వీరమ్మ, లింగమ్మ, నర్సమ్మ, సోవమ్మ, లక్ష్మీ వెంకటమ్మ, లక్ష్మీకాంత, విజయ, మంగమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.