నవరాత్రి శోభ | - | Sakshi
Sakshi News home page

నవరాత్రి శోభ

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

కళలను ఆదరిస్తూ, ఆకలిని తీరుస్తున్న వినాయక మండపాలు

చల్లటి సాయంత్రాలలో భక్తి గీతాల ఆలాపన

ప్రతి ఊరిలోనూ అన్న సంతర్పణ

భజనలతో భక్తి భావం

భజనలతో ప్రజల్లో భక్తిభావాలు పెంపు చేయవచ్చు. డీజేలతో ఒక పక్క చెవులకు ఇబ్బంది, మరో పక్క సౌండ్‌ పొల్యూషన్‌ వస్తుంది. డీజేలు రద్దుచేయడం ఎంతో మంచి పని. నగరంలోని దండివీధిలో భజన ఏర్పాటు చేశారు. – పాపారావు స్వామి,

శివజ్యోతి భక్త భజన బృందం

అపార్టుమెంటులో భజనలు

నగరంలోని పీఎన్‌ కాలనీలో ఉన్న సాయివిహార్‌ అపార్టుమెంట్‌లో గణపతి నవరాత్రు లు సందర్భంగా భజన ఏర్పాటుచేశారు. భజన ముక్తి మార్గమని మన పురాణాలు చెపుతున్నాయి.

– దాసరి పాపారావు, శ్రీసత్యసాయి భజన మండలి

సామాజిక బాధ్యత

అన్నదానం పుణ్యకార్యం మా త్రమే కాదు. ఆకలితో ఉన్న మనిషికి చేయూతనిచ్చే సామాజిక బాధ్యత కూడా. ఆహారం వృధా కాకుండా అవసరమైన వారికి చేరేలా చూడటం, సామూహిక అన్నదానాలను సద్వినియోగం చేయడం సమాజానికి మంచిది.

– ఎం.రాంబాబు, అడ్వకేట్‌

డీజేల గోల మధ్య ఓ సుస్వర రాగమొకటి పల్లవిస్తోంది. వింత వింత ఆకృతులనే వాదనల మధ్య ఓ అన్నార్తుడి ఆకలి తీరుతోంది. వినాయక మండపం సుస్వరాల ‘విందు’ను అందిస్తోంది. అసందర్భ సినిమా పాటలు, అశ్లీల గానాల విమర్శలు ఉన్నా.. ఎక్కడో ఓ చోట భజన మండలి వారు చల్లటి సాయంత్రం వేళ హృద్యమైన కీర్తనలు ఆలపిస్తూ దోష పరిహారం చేస్తున్నారు. భారీ అలంకరణలతో పాటు అంతే భారీగా అన్నదానాలూ జరుపుతున్నారు. దేవుడి పండగను కళను ఆదరించడానికి, ఆకలిని తీర్చడానికి వేదికగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

గ్రామాల్లో భజనలు

గ్రామాల్లో భజనలకు ప్రాధా న్యం ఇస్తాం. తద్వారా ప్రజలలో భక్తి భావాలు పెరుగుతాయి. గణపతి ఉత్సవాలకు ప్రతి ఏడాది భజనలు చేస్తుంటాం.

– కాయ లక్ష్మణరావు, శ్రీరామ భజన బృందం

భజన తప్పనిసరి

గణపతి ఉత్సవాల్లో భజనలు ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రజలకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భగవంతుని సులువుగా చేరేందుకే భజన చక్కటి మార్గమని అని మన పెద్దలు చెబుతారు. – కర్రి ఆదినారాయణ,

చైతన్యభారతి భజన బృందం

శ్రీకాకుళం కల్చరల్‌/ఇచ్ఛాపురం రూరల్‌:

వినాయక మండపాలు ప్రత్యేకత చాటుకుంటున్నాయి. డీజేల గోల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఒకప్పటిలా భజన బృందాల గానాలాపనతో పవిత్రత సంతరించుకుంటున్నా యి. ఈ ఏడాది జిల్లా అధికారులు గణపతి ఉత్సవాల సమయంలో ఊరేగింపుల కోసం డీజేలను పోలీసులు నిషేధించారు. గత ఏడాది కూడా నిషే ధం ప్రకటించినా అంతగా అమలు కాలేదు. ఈ ఏడాదీ అదే దారిలో వెళ్తున్నారు. అయితే డీజేల స్థానంలో అక్కడక్కడా మన సంప్రదాయ భజనలు వినిపిస్తున్నాయి. ఇది గణపతి ఉత్సవాలకు మరింత శోభను తెచ్చి పెడుతోంది. అపార్ట్‌మెంట్లు, వినాయక మండపాల్లో ఈ భజనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పీఎన్‌కాలనీ, దండివీధితో పాటు మారుమూల పల్లెల్లో ఈ గానాలాపన కొనసాగుతోంది.

అన్నం.. ఆత్మీయత

ఆకలితో ఉన్న వాడికి పట్టెడు అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు. చవితి సంబరాల్లో అన్నదానాలు చేయడమన్న ఆనవాయితీ కొనసాగుతోంది. గతంలో దేవాలయాలు, పెద్ద ఉత్సవ ప్రాంగణాలకే పరిమితమైన అన్నదాన కార్యక్రమాలు ఇప్పు డు వీధులు, కాలనీల్లోనూ విస్తరిస్తున్నాయి. ఉత్సవ కమిటీలతో పాటు యువత ముందుకు వచ్చి చందాలు సేకరించడం, దాతల సహకారం తీసుకోవడం, భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్నదానం అంటే కేవలం భోజనం పెట్టడం మాత్ర మే కాదు. అపరిచితులను సైతం ఆత్మీయంగా పలకరించి, ఒకే వరుసలో కూర్చోబెట్టి భోజనం పెట్ట డం ద్వారా సామాజిక సమానత్వాన్ని చాటడం. ఒకే పంక్తిలో అన్ని వర్గాల ప్రజలు భోజనం చేయడం పండుగ వాతావరణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

అన్నదానం కార్యక్రమంలో భక్తులు

పద్మావతినగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవ మండపం వద్ద డీజేలు వద్దని ప్లకార్డుల ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement