గోల్డ్‌ స్కీమ్‌ పేరుతో స్కామ్‌ | - | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ స్కీమ్‌ పేరుతో స్కామ్‌

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలో గోల్డ్‌ స్కీమ్‌ పేరుతో స్కామ్‌ చేసి సొంత యజమానినే అకౌంటెంట్‌ బురిడీ కొట్టించాడు. గడిచిన రెండేళ్లలో ఏకంగా రూ. 41.5 లక్షల స్కీమ్‌ సొమ్ము ను స్వాహా చేశాడని యజమాని ఆరోపిస్తున్నా రు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని జీటీ రోడ్డు లో రాజా జ్యుయలరీ షాపును నడుపుతున్న వైశ్యరాజు నాగరాజు వద్ద అకౌంటెంట్‌గా ఇప్పి లి రమణ కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. నాగరాజు నగరంలోనే రాజా సిల్క్‌మందిర్‌, ఆర్‌ఎస్‌ఎం తదితర షాపింగ్‌మాళ్లకు ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గోల్డ్‌ స్కీమ్‌ పేరుతో కస్టమర్ల రోజువారీ డిపాజిట్‌ సొమ్ము ను అకౌంట్స్‌లో టాలీ చేసి రికార్డుల్లోనే చూపిస్తున్న రమణ.. నగదు రూపేణా చూపించకపోవడమే కాక నెలకు రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు మాయం చేశాడు. ఇలా రెండేళ్లుగా రూ. 41.5 లక్షలు రమణ మోసం చేసినట్లు గ్రహించిన నాగరాజు ఒకటో పట్టణ పోలీసులను ఇటీవల ఆశ్రయించాడు. దీనిపై ఇంకా కేసు నమోదు కాలేదని, రాజీ ప్రయత్నం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

పల్లె నిద్రతో శాంతిభద్రతలపై అవగాహన

శ్రీకాకుళం క్రైమ్‌ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తలపెట్టిన పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతాభావాన్ని పోలీసులు కల్పిస్తున్నారని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మహిళలు–చిన్నారుల భద్రత, సైబర్‌ మోసాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, శాంతిభద్రతలు, ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద భైరిలో పల్లె నిద్ర చేయగా, రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు సిబ్బందితో కలిసి పీఎన్‌కాలనీలో చేయగా జిల్లాలో పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమాలు జరిగాయి. అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా, ఎక్క డ అవాంఛనీయ ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినా 112కు సమాచారం ఇవ్వా లని ఎస్పీ ప్రజలను కోరారు.

18.5 కిలోల గంజాయి స్వాధీనం

కాశీబుగ్గ: ఒడిశా నుంచి వయా పలాస మీదు గా విజయవాడకు గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని కాశీబుగ్గ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాకు చెందిన మున్నా బరదన్‌తో పాటు గజపతి జిల్లాకు చెందిన సంజనా కర్జిలకు ఓ వ్యక్తి విజయవాడకు గంజాయిని తరలిస్తే చెరో రూ. 5వేలు ఇస్తానని ఆశజూపాడు. తక్కువ సమయంలో ఆదాయం వస్తుందని భావించి అంగీకరించిన వీరిద్దరూ వేకువ జామున పదంపూర్‌ నుంచి పర్లాకిముడి చేరుకున్నారు. అక్కడి నుంచి కాశీబుగ్గ బస్సులో వచ్చి పలాస రైల్వే స్టేషన్‌ వైపు వెళ్తుండగా ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గా ప్రసాద్‌ ఆధ్వర్యంలోని బృందం వారిని అదుపులోకి తీసుకుంది. వారిదగ్గరున్న రెండు సంచులను తెరిచి చూడగా 18.5 కిలోల గంజాయి వెలుగుచూసింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి గంజాయి సరఫరా చేయమని చెప్పిన వ్యక్తి ఎవరన్న విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి. రామకృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement