హిరమండలం: సౌత్ ఇండియా ఎడ్యుకేషనల్ యూత్ ఐకాన్ అవార్డుకు హిరమండలం మండలంలోని దుర్భలాపురానికి చెందిన ఉపాధ్యాయుడు బాలరాజు ఎంపికయ్యారు. పాఠశాల విద్యారంగంలో కృషికి బాలరాజు చేసిన సేవలను గుర్తించిన మక్స్ గ్లోబల్ ఫౌండేషన్ ఈ అవార్డు ప్రకటించింది. ఈ నెల 20న హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చేతులమీదుగా బాలరాజు అవార్డు అందుకోనునున్నారు.
తెలంగాణలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలరాజు ఎస్‌అండ్‌ఎస్ పబ్లికేషన్స్ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువకులకు పోటీ పరీక్షలకుగాను శిక్షణ అందిస్తున్నారు.


