విశ్వకర్మలు మన తొలి ఇంజినీర్లు | - | Sakshi
Sakshi News home page

విశ్వకర్మలు మన తొలి ఇంజినీర్లు

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ కృషి చేస్తుంది

విశ్వకర్మ జయంతి వేడుకల్లో

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): విశ్వకర్మ జయంతి అంటే కేవలం ఒక వర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని తరతరాలుగా సమాజానికి సేవలందించిన వృత్తుల గురించి గుర్తుచేసుకునే సందర్భమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విశ్వకర్మలు మన సమాజంలో తొలి ఇంజినీర్లు అని అన్నారు. విశ్వకర్మ భగవాన్‌ జయంతి కార్యక్రమాన్ని డాకోజు వెంకటరావు అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయం (టౌన్‌ హాల్‌)లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొని విశ్వకర్మ భగవాన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ సంప్రదాయ వృత్తులు మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందేందుకు ఆధునిక శిక్ష ణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్‌ అవకాశాలు, ఆర్థిక సహకారం అందించాల్సిన అవసరం ఉంద న్నారు. ఆ దిశగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చేసి విశ్వకర్మలను ఆదుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. విశ్వకర్మలను కేవలం ఒక వృత్తికి చెందినవారిగా చూడకూడదని, వారి వెనుక ఉన్న జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, శ్రమను గౌరవించాలన్నారు. మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ ఎంవీ పద్మావతి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సీఈసీ మెంబర్‌ అంధవరపు సూరిబాబులు విశ్వకర్మల అభివృద్ధి ఒక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యపడుతుందన్నారు. విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఓ సామాజిక భవనాన్ని జిల్లా కేంద్రంలో నిర్మించి ఇచ్చిన ఘనత ధర్మాన ప్రసాదరావుకే దక్కిందన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు సింహాద్రి ధనుంజయరావు, అనుపోజు కోటిబాబు, టేకి వీరభద్రరావు, సింహాద్రి గోపాలకృష్ణ, మంతిన హరనాధరావు, బాలకృష్ణారావు, శ్రీనివాసరావు, కోటిపల్లి మోహనరావు, శ్రీధర్‌, తారక్‌లతో పాటు అధిక సంఖ్యలో విశ్వకర్మలు పాల్గొన్నారు. వారికి సన్మానం చేశారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తూర్పుకాపు బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్‌, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్‌, రాష్ట్రకార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, టెక్కలి నియోజకవర్గ పరిశీలకులు చల్ల రవికుమార్‌, యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, జిల్లా ప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం, కళింగవైశ్యకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు కోణార్క్‌ శ్రీను, ఎస్సీ విభాగం రాష్ట్రకార్యదర్శి పొన్నాడ రుషి, జిల్లా అధ్యక్షులు ముంజేటి కృష్ణమూర్తి, రౌతు శంకరరావు, లంక రమేష్‌, ఎం.ఏ భేగ్‌, గొండు రఘురాం, మూకళ్ళ తాతబాబు, మండవల్లి రవి, సాధు వైకుంఠరావు, గద్దిబోయిన కృష్ణయాదవ్‌, సనపల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement