● మద్యం అధిక ధరలన్నీ నేతల జేబుల్లోనికే ● జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీకి మించి విక్రయాలు ● పలాసలో మొదలై జిల్లా అంతటికీ పాకిన జాడ్యం ● మందుబాబులను నిలువు దోపిడీ చేస్తున్న సిండికేట్లు | - | Sakshi
Sakshi News home page

● మద్యం అధిక ధరలన్నీ నేతల జేబుల్లోనికే ● జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీకి మించి విక్రయాలు ● పలాసలో మొదలై జిల్లా అంతటికీ పాకిన జాడ్యం ● మందుబాబులను నిలువు దోపిడీ చేస్తున్న సిండికేట్లు

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

● మద్యం అధిక ధరలన్నీ నేతల జేబుల్లోనికే ● జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీకి మించి విక్రయాలు ● పలాసలో మొదలై జిల్లా అంతటికీ పాకిన జాడ్యం ● మందుబాబులను నిలువు దోపిడీ చేస్తున్న సిండికేట్లు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

ద్యం ఎమ్మార్పీపై అదనపు వసూలు, బెల్టు షాపుల్లో విక్రయాలు, అధిక ధరలకు మద్యం అమ్మకాలు.. ఇలా అడుగడుగునా వసూలవుతున్న అక్రమ సొమ్ము అంతిమంగా ఆ నియోజకవర్గాల కీలక నేతల జేబుల్లోకి వెళ్తోంది. మందుబాబులను అటు వ్యాపారులు, ఇటు నేతలు దర్జాగా నిలబెట్టి దోచేస్తున్నారు. చూసీ చూడనట్టు వదిలేసేందుకు ఎకై ్సజ్‌కు కొంత ముట్ట చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మద్యం బాటిళ్లపై అదనంగా బాదుతున్నారు. కొన్ని చోట్ల రూ.10, ఇంకొన్ని రూ.20 అంటూ వారి జేబులు గుల్ల చేస్తున్నారు.

పచ్చ నేతలకే కాసులు

ప్రైవేటు మద్యం పచ్చ నేతలకు కాసులు కురిపిస్తోంది. టీడీపీ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో సిండికేట్‌ అ వ్వగా, వారికి అండగా నిలిచినందుకు మిగతా నేతలకు భారీగా చేతులు తడుపుతున్నారు. స్వపక్షంలో పెద్ద శక్తుల నుంచి వ్యతిరేకత రాకుండా సిండికేట్లు మేనేజ్‌ చేస్తున్నాయి. ఒక్కో షాపుకింత అని నెల వా రీగా ఇచ్చేస్తున్నారు. జీతం పడినట్టు ఠంఛన్‌గా ప్రతి నెలా ఇంటికెళ్లి అందిస్తున్నారు. బెల్ట్‌షాపులు, కల్తీ మద్యం, అదనపు ధరలు ఇలా ఏదో ఒక తీరులో సిండికేట్లు సొమ్ము చేసుకుంటున్నాయి. దాంట్లో సింహభాగం నేతలకు అప్పచెబుతున్నారు. తొలుత పలాస, రాజాం నియోజకవర్గంలో ప్రారంభమైన దోపిడీ ఇప్పుడు జిల్లా అంతటా విస్తరించింది.

వారిదే గుత్తాధిపత్యం

జిల్లాలో ఉన్న మద్యం షాపులపై దాదాపు పచ్చ నేతలే గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. కొన్నిచోట్ల బయట వ్యక్తులకు షాపులు వచ్చినప్పటికీ నేతల కనుసన్నల్లోనూ ఆ షాపులూ నడవాల్సి వస్తోంది. లేదంటే దాడులు, ఆంక్షలు, బెదిరింపులకు దిగుతున్నారు. వారిని ఇబ్బంది పెట్టే విధంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. దీంతో ఎందుకొచ్చిందని వారి దారిలోకి మిగతా వ్యాపారస్తులు కూడా రాక తప్ప డం లేదు. వైన్‌షాపుల కౌంటర్‌లోనే క్వార్టర్‌ బాటిల్‌పై కొన్ని చోట్ల రూ.10, మరికొన్ని చోట్ల రూ.20 అదనంగా విక్రయిస్తున్నారు. పనిలో పనిగా పర్మిట్‌ రూమ్‌ల పేరుతో లూజ్‌ విక్రయాలు చేపడుతున్నారు. ఇక, మద్యం కల్తీ గురించైతే చెప్పనక్కర్లేదు. ఎక్కడ బడితే అక్కడ మద్యంలో నీళ్లు కలిపి, యథావిధిగా సీల్‌ వేసి విక్రయిస్తున్నారు. ఇలాంటి వాటిలో దొరికిన వారంతా టీడీపీకి చెందిన వారే కావడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement