సర్వీసు వైర్లు చోరీ | - | Sakshi
Sakshi News home page

సర్వీసు వైర్లు చోరీ

Jun 7 2026 12:27 AM | Updated on Jun 7 2026 12:27 AM

రణస్థలం: లావేరు నుంచి ఇజ్జాడపాలెం వైపు వెళ్లే రహదారి మధ్యలో వ్యవసాయ విద్యుత్‌ మోటార్‌ సర్వీస్‌ వైర్‌ను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి చోరీ చేశారు. అదే ప్రాంతంలోని సుమారు 10మంది రైతుల మోటార్లకు ఉన్న సర్వీస్‌ వైర్లను కట్‌ చేసి పట్టుకుపోయారు. శనివారం గమనించిన బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కొందరి వైర్లు మోటార్‌ బోరు లోపల పడిపోవడం వల్ల కొత్తగా వేయాలంటే వేలల్లో ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాగి కోసం, ఇతరులకు సర్వీస్‌ వైరు అమ్మేందుకు ఇలా చేస్తున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం భరిణికాంలో కూడా కొంతమంది రైతుల మోటార్‌ సర్వీస్‌ వైర్లు, రాగి చోరీ చేశారని తెలిపారు. అనంతరం లావేరు

ఎస్సై కె.అప్పలసూరికి రైతులు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement