న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026
●ఈ ఏడాది జనవరి 1న కంచిలి పద్మాతుల జాతీయ రహదారి దాటుతున్న ఈసురు పరదేశి అనే వృద్ధుడిని బైక్ వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందాడు.
●జనవరి 18న సంతబొమ్మాళి నుంచి టెక్కలి వచ్చే మార్గంలోఎదురెదురుగా ద్విచక్రవాహనాలు మితిమీరిన వేగంతో వచ్చి ఢీ కొట్టడంతో గార మండలానికి చెందిన ఎల్.రాజశేఖర్ మృతి చెందాడు.
●జిల్లా కేంద్రంలో డే అండ్ నైట్ సమీపంలో మహిళా వీఆర్‌ఓను మత్తులో ఉన్న యువకుడు ఽఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది.
●జిల్లా కేంద్రంలో ఉమెన్స్ కాలేజ్ సమీపంలో తోటి స్నేహితుడితో కలిసి బైక్ స్కిట్‌లు చేయడంతో అదుపుతప్పి వెనుక కూర్చున్న స్నేహితుడు మృతి చెందాడు.
శ్రీకాకుళం కై ౖమ్ :
తలకు హెల్మెట్ ఉండదు.. బండికి లైసెన్స్ ఉండదు.. వేగానికి పరిమితి ఉండదు.. చేతిలో బైక్ ఉంటే చాలు.. యూత్ రెచ్చిపోతున్నారు. రోడ్డుపై ఇతరులు కూడా వెళ్తారనే సోయి లేకుండా అతివేగంగా వాహనాలు నడుపుతూ అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారు. సరదాగా మొదలైన బైక్ రైడింగ్‌లు ఇప్పుడు ప్రమాదకరమైన ఆటలుగా మారుతున్నాయి. వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతుండడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది.
జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో యువత నిబంధనలు పాటించకుండా బైక్‌లు నడుపుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోవడం లేదు. దీనికి తోడు చిన్న వయసులోనే పెద్ద పెద్ద సీసీ వాహనాలను తీసుకుంటూ రయ్‌మంటూ దూసుకుపోతున్నారు. ఆ వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాల్లో పడుతున్నారు. జిల్లా కేంద్రంలో అయితే బైక్ సైలెన్సర్లను మార్చి నగర వీధుల్లో శబ్దాలు చేస్తున్న దాఖలాలు అనేకం కనిపిస్తున్నాయి.
తాజాగా జిల్లా కేంద్రంలో వేకువజామున హయాతినగరానికి చెందిన విద్యార్థి వేకువజామున వేగంగా వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవేమో.


