శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా ఆదివారం నుంచి మొదలు కానున్న ఇంటర్ సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్‌కు ఇంటర్‌బోర్డు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సప్లిమెంటరీ పేపర్లను దిద్దుబాటు చేసేందుకు జిల్లాకు 55 వేల జవాబుపత్రాలు చేరుకున్నాయి. స్పాట్ వాల్యుయేషన్‌కు క్యాంప్ ఆఫీసర్‌గా ఆర్‌ఐఓ మొదలవలస కృష్ణవేణి వ్యవహరిస్తుండగా, జనరల్–1గా జి.వెంకటేశ్వరరావు, జనరల్–2 సత్యన్నారాయణ వ్యవహరించనున్నారు. మిగిలిన ఏసీఓలు, సీఈ లు, ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్ల నియామక పత్రాలు ఇప్పటికే కాలేజీల లాగిన్‌లో పొందుపర్చారు. ఆదివారం నుంచి తొలివిడతగా జరగనున్న దిద్దుబాటులో సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, హిస్టరీ, మాథ్స్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ పేపర్లు జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఈనెల 9 నుంచి మొదలయ్యే రెండవ విడతలో ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, కెమిస్ట్రీ పేపర్ల జవాబుపత్రాలకు మూల్యాంకనం చేపట్టనున్నారు.


