వజ్రపుకొత్తూరు: మండలంలోని దేవునల్తాడలో బెల్టు షాపు నిర్వాహకులు బరి తెగించారు. అక్రమంగా నడుస్తున్న బెల్టు షాపు కోసం పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఫ్లడ్ లైట్ల మధ్య నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు చేప డుతున్నారు. గ్రామంలో బెల్టు షాపు వల్ల అక్రమ మద్యం ఏరులై పారుతున్నా.. అటు ఎకై ్సజ్ అధికారులు గానీ, విద్యుత్ చౌర్యం జరుగుతున్నా విద్యు త్ శాఖ అధికారులు గానీ చర్యలు తీసుకోవడం లేదు. బెల్టు షాపు, లైసెన్సు షాపు నిర్వాహకులు కూటమి నేతలు కావడంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు.


