కాలువల్లో రసాయనాలు స్ప్రే చేస్తున్న సిబ్బంది
గ్రామంలో వైద్య సేవలపై ఆరా తీస్తూ..
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో డయేరియాపై అధికారులు స్పందించా రు. వైద్యారోగ్యశాఖతో పాటు ఎంపీడీఓ కార్యాల య సిబ్బంది కలిసి ఆరు టీమ్‌లుగా గ్రామాన్ని శుక్రవారం జల్లెడ పట్టారు. 17 మంది ఏఎన్‌ఎంలు, 8 మంది ఆశ వర్కర్లు, ఇద్దరు డాక్టర్లతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటిని పరిశీలించారు. ఇంటిలో ఎంత మంది ఉంటున్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా..? వంటి వివరాలను ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పరిశీలించారు.
పారిశుద్ధ్య పనులు
గ్రామంలో 7 వీధుల్లో శానిటేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. కాలువల్లో పూడికలు తీయడం, రోడ్ల వెంబడి చెత్త చెదారం లేకుండా క్లీన్ చేయడం చేస్తున్నారు. మంచినీటి పైపులు ఎక్కడైనా డ్రైనేజీలో మరమ్మతులకు గురైతే తక్షణమే వాటిని బాగు చేసే దిశగా సచివాలయ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 30 మంది వరకూ వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరగా.. కొందరిని డిశ్చార్జ్ చేశారు.
నీటిని పరీక్షించాం
సింగుపురం గ్రామానికి సంబంధించి మంచినీటి నమూనా పరీక్షలను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఒకసారి శ్రీకాకుళంలోనూ, మరోసారి టెక్కలిలో ల్యాబ్‌లకు పంపించారు. వచ్చిన రిపోర్టుల్లో కలు షిత ఆనవాళ్లు లేవు. మరోసారి వైజాగ్‌కు నీటి నమూనాలు పంపిస్తాం.
– శ్యామ్, పంచాయతీ సెక్రటరీ


