అవయవదానంతో పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

అవయవదానంతో పునర్జన్మ

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

బూర్జ: బూర్జ గ్రామానికి చెందిన సూరి పుండరీకాక్షయ్య (44) రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిలో కిడ్నీవ్యాధితో చికిత్స పొందుతూ వైద్యం పొందుతూ శుక్రవారం మృతి చెందారు. అవయవదానం చేసి మరొకరికి పునర్జన్మనిచ్చారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పుండరీకాక్షయ్య మూడేళ్ల కిందట అనారోగ్యానికి గురయ్యారు. రెండు కిడ్నీలు ఫెయిల్‌ కావడంతో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. కొంతమంది మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ జీవన్‌ దాన్‌లో కిడ్నీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే అవయక దానం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో గురువారం అర్ధరాత్రి తరువాత మృతి చెందారు. ఆసుపత్రి యాజమాన్యం కుటుంబీకుల అంగీకారంతో అవయవదాన ప్రక్రియ పూర్తి చేసింది. అనంతరం మృతదేహాన్ని జెమ్స్‌ ఆస్పత్రి నుంచి బూర్జ గ్రామం వరకు బైక్‌ ర్యాలీగా తీసుకెళ్లారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసిన పుండరీకాక్షయ్యకు భార్య ప్రశాంతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement