రణస్థలం: కమ్మ సిగడాం సెంటర్‌లో శుక్రవారం శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ బి.రామారావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. విజయనగరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని ఒక ఆటోలో గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన కరిమిన ప్రసాదరావు రణస్థలం తీసుకొస్తుండగా కమ్మసిగడాం సెంటర్ దగ్గరలో పట్టుకున్నారు. కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీ నిర్వాహకులకు అధిక ధరకు బియ్యం అమ్మకాలు జరిపేందుకు తీసుకొస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలింది. పట్టుకున్న 860 కేజీల బియ్యాన్ని సివిల్ సప్లయ్ డీటీ అరుణకుమారికి అప్పగించారు. ఆమె కమ్మసిగడాం రేషన్ దుకాణానికి తరలించారు. ఆటోను జె.ఆర్.పురం పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. ప్రసాద్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.


