చట్టాలు అమలు చేయాలి
పర్యావరణపరిరక్షణ కోసం ప్రభుత్వా లు చేస్తున్న చట్టాలు, కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయాలి. ప్లాస్టిక్‌తో జరిగే అనర్థాలపై ప్రజలను చైతన్యపరచాలి.
– బోనెల గోపాల్, గ్రీన్ ఆర్మీ సేవా సంస్థ వ్యవస్థాపకులు
అమ్మితే కఠిన చర్యలు
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ అమ్మకాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. మా పరిధిలో ప్లాస్టిక్‌ని పట్టుకొ ని సీజ్ చేశాం. అమ్మకందారులపై జరిమానా వేశాం.
– శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్,
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ
వజ్రపుకొత్తూరు రూరల్:
తీరాల్లో ప్లాస్టిక్ సంచులు, నదుల్లో ప్లాస్టిక్ డబ్బాలు, కాలువల్లో పాలిథీన్ క్యారీ బ్యాగులు, వీధుల్లో, మలుపులలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. అంతెందుకు పశువుల కడుపుల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. ఏటా ప్రజలు విని యోగించి విసిరి పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థా లు ఇలా మొత్తం విస్తరించేస్తున్నాయి. నియంత్రణ చర్యలు లేకపోవడం, స్వీయ నియంత్రణ పాటించకపోవడంతో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి.
చర్యలు ఉన్నాయా..?
దుకాణాలు, ఇతర వ్యాపారాల్లో విచ్చల విడిగా ప్లాస్టిక్ వస్తువులు, సంచులు అమ్మకాలు చేపడుతుంటే ప్రజా ప్రతి నిధులు, అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నియంత్రణ చేయాలని, దీని కోసం ప్రభుత్వాలు ప్లాస్టిక్ అమ్మకందారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల మున్సిపల్ కమిషనర్ ప్లాస్టిక్ అమ్మకాల షాపుపై దాడులు చేసి 3000 కిలోల ప్లాస్టిక్ సామగ్రిని సీజ్ చేశారు. అయితే ఆ ప్లాస్టిక్‌ని ఏం చేశారన్న విషయాన్ని ఇంత వరకు మీడియాకు అధికారులు చెప్పకపోవడంతో పాటు షాపు యజమానులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. అదే పలాస–కాశీబుగ్గలో ఉన్న ప్లాస్టిక్ దుకాణదారులు సిండికేట్‌గా భారీ మొత్తంగా డబ్బులు వసూలు చేసి అధికారులకు ఇచ్చినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.


