జాతీయ అప్రెంటిస్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

జాతీయ అప్రెంటిస్‌ మేళా

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

ఎచ్చెర్ల: జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ ఎచ్చెర్లలో ఈ నెల 8వ తేదీన సోమవారం జాతీయ అప్రెంటిస్‌ మేళాను నిర్వహించనున్నారు. ఈ మేళాకు జిల్లాలోని 7 ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నాయి. 8వ తేదీ ఉదయం 9 గంటలకు జరిగే అప్రెంటిస్‌ మేళాకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్‌లలో శిక్షణ పొందిన విద్యార్థులు మూడు బయోడేటాలతో పాటు ఐటీఐ, పదో తరగతి, ఆధార్‌ మూడు సెట్లు కలిగిన సర్టిఫికెట్లు, మూడు కలర్‌ ఫొటోలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ తెలిపా రు. జిల్లాలోని ప్రముఖ కంపెనీలు అరబిందో, శ్యాంపిస్టన్స్‌, బ్లూస్టార్‌, నోర్డిక్స్‌, స్మార్ట్‌కం, వరుణ్‌మోటార్స్‌ వంటి కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు.

శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.3.11 లక్షలు

జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం గురువారం లెక్కించారు. గడిచిన 71 రోజులకు గానూ రూ.3,11,196 వచ్చినట్లు ఆలయ ఈఓ కె.ఏడు కొండలు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ శివ ప్రసాద్‌ పాడి, ఆలయ పాలక మండలి సభ్యులు, పర్యవేక్షణ అధికారి ఎస్‌.నాగేశ్వరరావు, సత్యసాయి భక్తులు పాల్గొన్నారు.

ఎఫ్‌ఎన్‌ఓల జీతాల జాప్యంపై విచారణ

అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలకు ఈ ఏడాది మే నెల జీతాల చెల్లింపులో జాప్యం జరిగిందంటూ కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులు, విభాగ బాధ్యులపై విచారణ చేపట్టారు. ఈమేరకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీఓ సాయిప్రత్యూష, డీసీహెచ్‌ఎస్‌ విజయలక్ష్మి, మైన్స్‌ ఏడీలతో కూడిన త్రిసభ్య కమిటీ స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో గురువారం వి చారణ చేపట్టారు. మొత్తం జిల్లాలో 120 మందికి జీతాల చెల్లింపు జరగలేదని ఓ ఉద్యోగి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో త్రిసభ్య కమిటీ డీఎంహెచ్‌ఓ అనిత, ఏఓ బాబూరావు, సూపరింటెండెంట్ల వద్ద సమాచారం సేకరించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందించనున్నారు. తదుపరి చర్యలపై కలెక్టర్‌ నుంచి ఆదేశాలు రానున్నాయని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement