శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నాగావళి నదిని మురికి నీటి నదిగా తయారుచేసి విధ్వంసానికి పాల్పడుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు విమర్శించారు. శ్రీకాకుళం నాగావళి నదిలో కళ్లకు గంతలు కట్టుకొని జల కాలుష్యం నివారించాలని కోరుతూ బుధవా రం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో సుందర శ్రీకాకుళం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం అమలు చేస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. మూడుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఎందుకు నిధులు కేటాయించలేదని నిలదీశారు. నదిలో కలిసిన ము రుగునీరు తాగడం వల్లే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. నాగావళి జల కాలుష్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామన్నారు.


