శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) – 2026 ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, క్షేత్రస్థాయి మ్యాపింగ్ పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుంచి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, తహసీల్దార్లు, బీఎల్‌ఓలతో ప్రత్యేకంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన సర్ ప్రక్రియ ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,088 మంది బీఎల్‌ఓలలో అత్యధిక శాతం మంది మ్యాపింగ్‌ను సమర్థంగా పూర్తిచేశారని, మిగిలిన 60 మంది బీఎల్‌ఓలు కూడా తమ పరిధిలోని పనులను త్వరితగతిన పూర్తి చేసే లా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రాబోయే ఇంటింటి సర్వే ప్రారంభానికి ముందే సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించి, మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను కోరారు.
ఎచ్చెర్ల: ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం గ్రామానికి చెందిన పి. రత్నకుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈమె భర్త, పిల్లలతో కలిసి విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ గత ఎనిమిదేళ్లుగా జీవనం సాగిస్తున్నా రు. వీరు బాటిల్స్ ఏరుకుంటూ జీవిస్తున్నారు. భర్త బయటకు వెళ్లి గురువారం తిరిగి వచ్చి చూస్తే భార్య చనిపోయి ఉంది. పోలీసులకు వి వరాలు తెలియపరచడంతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
జి.సిగడాం: పాలఖండ్యాం గ్రామానికి చెందిన డొప్ప అప్పన్నకు చెందిన గొర్రెల మందపై గురువారం వీధి కుక్కలు దాడి చేయడంతో 10 గొర్రెలు చనిపోయాయి. మరో ఆరు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గ్రామంలో ఉన్న సు మారుగా 20 కుక్కలు ఒకేసారి గొర్రెలపై దాడి చేశాయని బాధితుడు వాపోయారు. అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రణస్థలం: మండల కేంద్రంలోని జేఆర్ పురం పంచాయతీలో గల వెంకటేశ్వర కాలనీలో షేక్ సాజహన్ ద్విచక్ర వాహనం (గ్లామర్ బైక్) గుర్తు తెలియని వ్యక్తి బుధవారం తీసుకువెళ్లిపోయాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో అటూ ఇటూ చాలా సేపు తిరిగి ద్విచక్ర వాహ నం నడిపించుకుని వెళ్లిపోయాడు. ఈ దొంగత నం సమీపంలోని సీసీ పుటేజ్‌లో నమోదైంది. ఈ చోరీ గురువారం సోషల్ మీడియా ద్వారా బహిర్గతమైంది. దీనిపై జేఆర్ పురం పోలీసు లు ఇంకా కేసు నమోదు చేయలేదు.


