● అన్నదాత సుఖీభవలో కోత పెట్టా రు. తల్లికి వందనంతో దగా చేశారు.
● నిరుద్యోగ భృతికి ఎసరు పెట్టారు. సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే లోపు నిరుద్యోగికి నెలకి రూ. 3వేలు చొప్పున ప్రకటించారు. రెండేళ్లలో 7లక్షల 28వేల 210మందికి రూ.437కోట్ల మేర ఇవ్వకుండా మోసం చేశారు.
● ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బాకాలు ఊదారు. అమలు చేయకుండా జిల్లాలో 7లక్షల 28వేల 210మందిని మోసగించారు.
● మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు 19 ఏళ్లు నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. 7లక్షల 59వేల 692మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురు చూస్తున్నారు.
● 50ఏళ్లకే మహిళలకు పింఛన్ మంజూరు చేస్తామని చెప్పారు. పథకం అమలు చేయలేదు సరికదా ఉన్న పింఛన్లు తీసేస్తున్నారు.
● చంద్రబాబు హామీ ప్రకారం జిల్లాలో 3లక్షల 07వేల 537మంది పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు.
● తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీలో అవకతవకలకు పాల్పడి అభ్యర్థులకు అన్యాయం చేశారు.


