ఆమదాలవలస: మున్సిపాలిటీ పరిధి రెండోవార్డు కృష్ణాపురానికి చెందిన యువ వైద్యురాలు డాక్టర్ చింతాడ మౌనిక న్యూరాలజీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. మౌనిక విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, అనంతరం అదే కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్‌తో పాటు డీఎం సూపర్ స్పెషాలిటీ కోర్సు (న్యూరాలజీ)ను విజయవంతంగా పూర్తి చేశారు. తండ్రి రాజగోపాలరావు రాజమహేంద్రవరం జిల్లా లోక్ అదాలత్ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తుండగా, తల్లి భారతి గృహిణి. విజయవాడలో నిర్వహించిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతులమీదుగా మౌనిక గోల్డ్ మెడల్ అందుకున్నారు.


