డైసీకి లాస్ట్‌ సెల్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

డైసీకి లాస్ట్‌ సెల్యూట్‌

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

కేన్సర్‌తో బాధపడుతూ మృతిచెందిన పోలీసు జాగిలం డైసీ

అధికార లాంఛనాలతో

అంత్యక్రియలు

శ్రీకాకుళం క్రైమ్‌, ఎచ్చెర్ల : పేలుడు పదార్థాలు కనిపెట్టడంలో నిపుణురాలైన పోలీసు జాగిలం డైసీ అనారోగ్యంతో కన్ను మూసింది. ఐదు నెలలుగా కేన్సర్‌తో బాధ పడుతున్న డైసీ మంగళవారం మృతి చెందింది. దీంతో పోలీసులు జాగిలానికి అధి కార లాంచనాలతో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రమణ మాట్లాడుతూ వీఐ పీ, వీవీఐపీ పర్యటనలు, రైల్వే స్టేషన్లు, బస్‌కాంప్లెక్సులు, చెక్‌పోస్టు తనిఖీలు, భారీ బందోబస్తు విధుల్లో డైసీ కీలకపాత్ర పోషించిందన్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నిర్వహించే పోలీస్‌ పరేడ్‌లో తన విన్యాసాలతో అలరించేదన్నారు. భద్రతా తనిఖీల్లో తన సేవలు అమోఘమని జిల్లా పోలీస్‌ శాఖకు డైసీ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ ఎల్‌.శేషాద్రి, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ప్రసాద్‌, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్‌ డాగ్‌ హ్యాండ్లర్లు ఎస్‌ గోవిందరావు, ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement