శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో పూర్తి సానుకూల దృక్పథం కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జా యింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి జిల్లాలోని తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో నిర్వహించిన వారాంతపు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సమావేశంలో పలు ప్రగతి పనులపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి మ త్స్యకారునికి ‘మత్స్యకార భరోసా’ పథకం సక్రమంగా అందేలా చూడాలని అధికారుల ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులకు తావుండకూడదన్నా రు. అదేవిధంగా, జిల్లాలో పంపిణీ అవు తున్న ఇసుక నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు నాణ్యమైన ఇసుక మాత్ర మే అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని, అంగన్‌వాడీ సేవల్లో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.


