ఇదేనా హామీల అమలు
నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేసే పద్ధతి ఇదేనా. అర్హులైన వారికి ఉద్యోగాలు వస్తాయని ఎంతోమంది కష్టపడి చదివితే అలాంటి వారికి తీవ్ర అన్యాయం జరిగింది. యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఒక్క పైసా ఇవ్వలేదు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు తప్ప యువగళంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకావడం లేదు.
– పేరాడ తిలక్, పార్టీ టెక్కలి సమన్వయకర్త
సీబీఐతో దర్యాప్తు చేయించాలి
ఉద్యోగ పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని చేతకాని ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ అక్రమాలపై సీబీఐ తో దర్యాప్తు చేయించాలి. పేపర్ లీక్‌కు కార ణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ని బర్తరఫ్ చేయాలి. చంద్రబాబుకు ప్రజా సంక్షేమం పట్టదు.
– తమ్మినేని సీతారాం,
మాజీ స్పీకర్
లోకేష్ అనర్హుడు
మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను మోసం చేసిన లోకేష్ విద్యాశాఖమంత్రి పదవికి అనర్హుడు. నిరుద్యోగుల వీక్‌నెస్‌తో కూటమి నేతలు ఆటలాడుకోవడం సరికాదు. సచివాలయాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగలు ఇచ్చాం. ఆ పరీక్షలన్నీ పకడ్బందీగా నిర్వహించాం. ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేయాలి. అర్హులకు న్యాయం జరగాలి. – ధర్మాన కృష్ణదాస్,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
నకిలీగాళ్లకు ఉద్యోగాలా..?
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. స్పోర్ట్స్ కోటా అనుమానాలను నివృత్తి చేయాలి. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా అనర్హుడు.
– ఎంవీ స్వరూప్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
స్టేట్ ఫస్ట్ ఎలా..?
డీఎస్సీ పేపర్ తయారుచేసే సంస్థలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నవీన్‌కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా సాధ్యమైంది. ఏపీపీఎస్సీ విధానాలను అనుసరించకుండా అర్హులకి టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. – మార్పు పృథ్వీ, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు


