అధికారం అండగా.. సంపాదన దండిగా | - | Sakshi
Sakshi News home page

అధికారం అండగా.. సంపాదన దండిగా

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి అదనంగా రూ.10 నుంచి రూ. 30 వరకు వసూలు

అడిగే నాథుడే కరువు

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో దాదాపు 176 లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారు. 19 బార్‌ అండ్‌ రెస్టారెంట్లున్నాయి. ఏ దుకాణానికి వెళ్లినా, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లినా ఎమ్మార్పీకి మించే సరుకు అ మ్ముతున్నారు. నిన్న మొన్నటి వరకు బాటిల్‌ ఎ మ్మార్పీపై రూ. 10 అదనంగా అమ్మిన వ్యాపా రులు ఇప్పుడు ఏకంగా రూ. 20 నుంచి రూ. 30 వరకు అదనంగా అమ్ముతున్నారు. పచ్చ సిండికేట్‌ అండతో.. పచ్చని సిక్కోలులో మద్యం దందా చేస్తున్నారు. వీరిని అడిగే నాథుడే లేకపోయాడు.

శ్రీకాకుళం కార్పొరేషన్‌ పరిధిలో 12 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉండగా హయాతినగరం, డేఅండ్‌నై ట్‌, బలగ, రామలక్ష్మణ కూడలి, నవభారత్‌ జంక్షన్‌ పరిధి బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో ఎమ్మార్పీకి అదనంగా రూ. 20 నుంచి రూ. 30 వసూలు చేస్తున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రెండు బార్లలోనూ ఇదే పరిస్థితి. ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో ఉన్న 4 బార్లలో రూ. 10 నుంచి రూ. 20 వసూలు చేస్తున్నారు. కొను గోలుదారులు ఇదేంటని ప్రశ్నిస్తే.. ఏసీ ఖర్చు లు, శనగపప్పు, సర్వీసింగ్‌ అంటూ దాటేస్తున్నా.. వాటికీ వసూలు చేయడం విశేషం.

ఒడిశా మద్యం అంతా కాశీబుగ్గ, ఇచ్ఛాపురానికే..

ఒడిశా నుంచి అక్రమంగా వచ్చే మద్యం జిల్లా లోని బోర్డర్‌ ప్రాంతమైన ఇచ్ఛాపురం, ఏఓబీ ప్రాంతాలతో టచ్‌ ఉన్న పలాస–కాశీబుగ్గకే చేరుతోంది. అధికారుల నిఘా వైఫల్యం కారణంగా అక్కడి మద్యం ఏరులై పారుతోంది. కాశీబుగ్గలో సిండికేట్‌ నడుపుతున్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లు బహిరంగ టాక్‌. ఒడిశా ఎంజీ ప్యాకెట్లలో తీసుకొచ్చి ఆంధ్రా లిక్కర్‌లో కల్తీ చే స్తున్నట్లు వినికిడి. కాశీబుగ్గలో క్వార్టర్‌ రూ. 200 కు మించి ఉండే బాటిల్‌లో రూ. 150 చీప్‌ లిక్క ర్‌ కూడా కల్తీ చేస్తున్నారన్న సమాచారం ఉంది.

3 వేలకు పైగా బెల్టు షాపులు..

జిల్లాలో దాదాపు 3 వేలకు పైగా బెల్టుషాపులు నడుపుతున్నట్లు సమాచారం. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్టు, ప్రైవేటు దుకాణాలు, బార్లు వెలుస్తున్నాయి. బెల్టు షాపుల్లో రూ. 30 నుంచి రూ. 70 వరకు సైతం అమ్మకాలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement