● పశ్చిమబెంగాల్ గజ దొంగల తీరిది
● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : గజదొంగలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఒడిశాలో ఉంటూ ఉత్తరాంధ్రలో దొంగతనాలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు మహమ్మద్ మీజాన్ (36) మహమ్మద్ హసన్ (26) లను ఖాకీలు పట్టుకున్నారు. నాలుగు నెలలుగా జిల్లాలోని కాశీబుగ్గలో 3, టెక్కలిలో ఓ భారీ చోరీ చేశారు. మన్యం జిల్లా పార్వతీపురంలో ఓ చోరీ, ఒడిశా బరంపురంలో మరో చోరీ చేసి దాదాపు రూ. 80.55 లక్షల సొత్తు దోచేశారు. సీఐ వై.రామకృష్ణ ఆధ్వర్యంలోని కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడటంతో సోమవారం కటకటాలపాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు.
మహమ్మద్ మీజాన్ బరంపురంలో ఉంటూ స్టీలు వ్యాపారినని చెప్పుకుని తిరుగుతూ రెక్కీ చేసి రాత్రి దొంగతనాలు చేసేవాడు. గత చోరీ కేసుల్లో జైలుకెళ్లిన మీజాన్ గత అక్టోబరులో విడుదలై మళ్లీ చోరీలకు స్కెచ్ వేసుకున్నాడు. తన గ్రామానికే చెంది న మహ్మద్ హసన్‌ను తోడు చేసుకున్నాడు.
పట్టుబడ్డారిలా..
సీఐ రామకృష్ణకు వచ్చిన సమాచారంతో గరుడఖండి జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో ఇ ద్దరు నిందితులను ప్రత్యేక బృందాలతో కలసి సోమ వారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 12 తులాల బంగారం, 20.349 కిలోల వెండి, రూ. 1,09,350 లు నగదు, రూ. లక్ష విలువ చేసే ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ మీజాన్‌పై శ్రీకాకుళం జిల్లాలో 7 కేసులు, విజయనగరం జిల్లాలో 7 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 2 పాత కే సులు, కొత్తగా మరో 6 కేసుల్లో ముద్దాయయ్యాడు.
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వర రెడ్డి


