గాదె వెంకటరెడ్డి మృతికి సంతాపం | - | Sakshi
Sakshi News home page

గాదె వెంకటరెడ్డి మృతికి సంతాపం

May 30 2026 8:47 AM | Updated on May 30 2026 8:47 AM

గాదె వెంకటరెడ్డి మృతికి సంతాపం సత్తాచాటిన విద్యార్థులు జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా మధుబాబు వడదెబ్బకు ఉపాధి వేతనదారు మృతి రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

నరసన్నపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి గా పనిచేసిన గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ సంతాపం వ్యక్తం చేశా రు. దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు విశేష సేవలందించారని, ఆయన మృతి తీరని లోటని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

ఇచ్ఛాపురం: ఏపీ పీజీసెట్‌ 2026 ఫలితాల్లో తెలుగు విభాగంలో పట్టణానికి చెందిన తెన్నేటి శ్రీనిజ శర్మ సత్తాచాటింది. 82 మార్కులతో స్టేట్‌ఫస్ట్‌ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. ఈమె పట్టణంలోని ప్రముఖ పురోహితుడిగా అందరి కీ సుపరిచితులైన తెన్నేటి తేజేశ్వర శర్మ కుమా ర్తె కావడంతో అభినందనలు తెలిపారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ పీజీసెట్‌–2026 ఫలితాల్లో నౌపడకు చెందిన అంపలాం సుచిత్ర ప్రతిభ కనబర్చారు. బోటనీ సబ్జెక్టులో 59 మా ర్కులు సాధించడం ద్వారా 169వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈమెను పలువురు అభినందించారు.

గార: జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా జి.మధుబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజయనగరం జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ శ్రీకాకుళం జిల్లా జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా పనిచేసేవారు. అడిషనల్‌ సూపరింటెండెంట్‌గా పదోన్నతి రావడంతో జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు.

సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బుసాబద్ర గ్రామానికి చెందిన ఉపాధి హామీ వేతన దారురాలు పల్లి మహాలక్ష్మి (50) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహాలక్ష్మి శుక్రవారం ఉదయం గ్రామంలోని ఉపాధి పనికి వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. సాయంత్రం పని సమయానికి కుటుంబ సభ్యులు నిద్ర లేపినా లేవలేదు. చూస్తే ఆమె చనిపోయారు. ఆమె మృతితో కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమెకు భర్త శ్యామ్‌ సుందర్‌, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

పలాస: మండలంలో కొబ్బరిచెట్లూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సోంపేట మండలం తాళ భద్ర గ్రామానికి చెందిన సాయికుమార్‌ హరిపు రం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వెను క నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడ ఉన్నవారు 108కి సమాచారం ఇవ్వగా వారు వెంటనే వచ్చి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రున్ని తీసుకొని వెళ్లి మెరుగైన వైద్యం అందించారు. కాశీబుగ్గ సీఐ రామకృష్ణను వివరణ కోరగా తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement