●వేసవిలో
నేర్చుకుంటున్న విద్యార్థులు
శ్రీకాకుళం కల్చరల్:
చిన్నారులు ఎటువంటి విషయానైనా ఆటల రూపంలో నేర్చుకునేందుకు శ్రద్ధ చూపుతారు. సంఖ్యా శాస్త్రంలోని ప్రాథమిక విధానాలైన కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం చేయడాన్ని ఆటల రూపంలో నేర్పుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఈ విధంగా లెక్కలు నేర్పించేందుకు ‘అబాకస్’ వేసవి క్లాసులకు పంపుతున్నారు.
అబాకస్ నిర్మాణం
అబాకస్ అనేది ఒక దీర్ఘ చతురస్రాకారపు చెక్క లేదా ప్లాస్టిక్ చట్రం. ఈ చట్రంలో నిలువుగా సమాంతర కడ్డీలు ఉంటాయి. ఈ కడ్డీల గుండా కదిలే పూసలు ఉంటాయి. ఈ పూసలను పైకి, కిందకి జరపడం ద్వారా లెక్కలు చేస్తారు. దీనిలో ఒక అడ్డంగా ఉంచబడిన దండం లంబంగా ఉండి పూసలను రెండు వర్గాలుగా చేస్తుంది. నిలువుగా ఉన్న తీగలు స్థాన విలువలను, దశాంశ స్థానాలను తెలుపుతాయి. దీనిలో పూర్తిగా కుడివైపు గల నిలువు వరుస ఒకట్లో స్థానమును, దానికి పక్కనున్న స్థానం పదుల స్థానమును ఇలా స్థాన విలువలను తెలుపుతాయి. పిల్లల్లో గణిత సామర్థ్యం, ఏకాగ్రత, వేగవంతమైన మానసిక గణనలను మెరుగుపరచడానికి ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది.


