పొందూరు: ఆరు దశాబ్దాలుగా శ్మశానవాటికగా వినియోగిస్తున్న భూమిని గ్రామంలో ఇంతవరకు తాము చూడని వ్యక్తి ఆక్రమించుకోవడానికి చూస్తున్నాడని, తమ గ్రామ యువకులపై కేసులు పెట్టి వేధిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆర్.సీతారాంకు జోగ న్నపేటకు చెందిన మహిళలు విన్నవించుకున్నారు. కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు సీతారాం శుక్రవారం జోగన్నపేటలో సంబంధిత భూములను పరిశీలించారు. జోగన్నపేట గ్రామానికి చెందిన ఎన్.రవీంద్రబాబు సర్వేనంబర్ 407–1, 402–6 సర్వే నంబర్లలో ఆరు ఎకరాలు భూముల వివాదంపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సుమారు ఆరు దశాబ్దాలుగా లేని భూములు ఇప్పుడెలా వచ్చాయ ని వందలాది మంది మహిళలు అధికారులతో పా టు ఫిర్యాదుదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 407–1 సర్వే నంబరు భూములపై కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, న్యాయపరంగా పరిష్కరిస్తామని సీతారాం హామీనిచ్చారు. తమకు తక్షణమే న్యా యం జరగాలని స్థానికులు అధికారుల వాహనాల ను అడ్డుకున్నారు. ఎస్‌ఐ సత్యనారాయణ గ్రామస్తులతో మాట్లాడి శాంతింపజేశారు. కమిషన్ సభ్యుడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడంతో మహిళలు అక్కడకు చేరుకున్నారు. అధికారులు లేకపోవడంతో నిరసన తెలిపారు.


