సిక్కోలుపై సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. సూర్యోదయం నుంచి అస్తమయం వరకు వేడి దాడి చేస్తున్నాడు. దాదాపు 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరో నాలుగైదు రోజులు ఈ ఉక్కపోత తప్పదని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను ఆరు బయటకు పంపకూడదని హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎండలు తీవ్రంగా ఉన్నందు న పిల్లలను మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకు బయ టకు వెళ్లనివ్వకుండా చూసుకోవాలి.
డీహైడ్రేషన్‌తో పాటు వడదెబ్బతో ప్రాణాలకు ముప్పు రాకుండా జాగ్రత్తలు వహించాలి.
ముందుగా ఈ రోజుల్లో కచ్చితంగా మంచినీటితో పాటు కొబ్బరినీరు, మజ్జిగను దాహం లేకపోయినా ఇవ్వాలి.
నిత్యం యూరిన్‌లో 1.5 లీట ర్లు, చెమటతో ఒక లీటర్, అదనంగా మరో అరలీటర్ బయటకు పోతుంది. దీనికి అదనంగా నీరు తాగాలి.
జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు సడన్‌గా వస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.


