న్యూస్‌రీల్
శ్రీకాకుళం
ఆ రూ.10 ఎవరి కోసం?మద్యం ఎమ్మార్పీపై పది అదనంగా తీసుకుంటున్నారు. ఇది ఎవరి జేబులోకి వెళ్తోంది. –8లో
జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తులు
● రైల్వేస్టేషన్, హైవే వెంబడి కుటుంబాలతో ఆవాసాలు
● అక్రమ మార్గాల్లో ఆధార్‌కార్డులు
పొందుతున్నట్లు ఆరోపణలు
● స్థానికుల్లో భయాందోళనలు
● మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
● జిల్లావాసులపై రోజుకు సగటున రూ.8,73,900ల అదనపు భారం
బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026
ఆధార్ కార్డుల కోసం ప్రయత్నాలు..
ఈ అపరిచిత వ్యక్తులు కొందరైతే ఆధార్ కార్డులు పొందేందుకు అక్రమ మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నా రు. ఇక్కడే వీరిపై తమకు అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెబుతున్నారు. స్థానికంగా కొందరు దళారులు డబ్బు కోసం సహకరిస్తున్నట్లు, సంబంధిత రెవెన్యూ అధికారులకు రూ.వేలల్లో ముట్టజెప్పి వీరికి గుర్తింపు కార్డులు ఇప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రెవెన్యూ, పోలీసులు అధికారులు ఇద్దరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
శ్రీకాకుళం క్రైమ్, కంచిలి :
‘మేము 25 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఉంటున్నాం.. ఇటీవల కాలంలో కొత్తకొత్త ముఖాలు కనబడుతున్నాయి. వ్యక్తులు గుంపులు గుంపులుగా తిరుగుతూ కలవరపాటుకు గురిచేస్తున్నారు. ఎవరు మీరు అని ప్రశ్నిస్తే ఉలకరూ.. పలకరూ.. రాత్రి వేళ సంచారం ఎక్కువగా ఉంటోంది. ఎన్నడూ లేని భయం మాలో ఇటీవల పెరుగుతోంది. అసలు ఎవరు వీరు.. ఎక్కడ నుంచి వస్తున్నారు.. ఇక్కడ ఏం చేస్తున్నారు.’
కొద్ది రోజులుగా కంచిలి, సోంపేట వాసులు చెబుతున్న మాటలు ఇవి. ఇక్కడే కాదు జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం బోర్డర్ పురుషోత్తపురం, మన్యం జిల్లా పాలకొండ వైపు కొత్త వ్యక్తుల ఉనికి పెరుగుతోందని, సమీప రైల్వేస్టేషన్లు, హైవేల వెంబడి ఉన్న నిర్మానుష్య ప్రాంతాలనే ఎంచుకుని ఆవా సాలు ఏర్పరచుకుంటున్నట్లు సమాచారం. ఓ వైపు దోపిడీలు, దొంగతనాలకు కేరాఫ్‌గా మారుతున్న సరిహద్దు ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తులు కనబడటం, ఇలా ఆవాసాలు ఏర్పరచుకోవడం ఆందోళన కు గురి చేస్తోంది.
కొన్ని ఘటనలు
ఇచ్ఛాపురం బోర్డర్‌లో ఉన్న పురుషోత్తపురం, సోంపేట, పలాసల్లోనే కాక పార్వతీపురం జిల్లా పాలకొండలో కొత్త ముఖాల ఉనికి ఇటీవల పెరి గిందని, దాదాపు 2 వేల మంది వరకు చేరి ఉంటారని ప్రత్యేకంగా ఓ సంస్థ సర్వే చేయించినట్లు సమాచారం. వీరంతా రైల్వే స్టేషన్లు, సమీప హైవేల్లో జనసంచారం అంతగా లేని ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పర్చుకుంటున్నట్లు భోగట్టా. రోజూ రైళ్లలో కనీసం ఐదారు కొత్త కుటుంబాలైనా దిగుతుండటం గమనార్హం.
సోంపేట, కంచిలి, జలంత్రకోటల్లోని కొన్ని దాబాల్లో పనిచేస్తున్న యువత ఎక్కువగా జార్ఖండ్, బీహార్, రాజస్థాన్ నుంచే వచ్చామని చెబుతున్నారు. వీరంతా దాదాపు హిందీ భాషలో ఎక్కువగా మాట్లాడుతున్నారు.
గ్రానైట్, సీలింగ్, పుట్టీలు, పెయింటింగ్ పేరుతో ఇటీవల యువకులు వందల్లో వచ్చారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
సత్తు బిందెలు, పాత్రలు, దుప్పట్లు, బ్లాంకెటు, జీలుగుపరుపులు, జుట్టు ఇస్తే బూరలు, ప్లాస్టిక్ బొమ్మలు, సైడ్ పిన్నులు, తోపుడు బళ్లపై పానీపూరీ, సమోసా, చిప్స్‌లు తదితర అమ్మకాలు జరిపే వారిలో ఎక్కువ శాతం అనుమానాస్పదంగా కనిపిస్తుంటారని, నంబర్‌ప్లేట్లు లేని ద్విచక్రవాహనాలపై తిరుగుతుంటారని స్థానికులు చెబుతున్నారు.
సోంపేటలో ఇటీవల బయట నుంచి వచ్చినవారే దాదాపు 9 షాపులు రెంటుకు నడుపుతున్నట్లు సమాచారం.
కొన్ని నెలల క్రితం కంచిలి హైవే బ్రిడ్జి మసీదు ఎదురుగా ఉన్న ఓ దాబాలో ఆవుమాంసం విక్రయించడం వార్తల్లోకి ఎక్కింది.
ఆరేడు నెలల నుంచి కవిటి, ఈదుపురం, బెలగాం గ్రామాల్లో కొత్త వ్యక్తులు వచ్చి స్థానికంగా వ్యాపారాలు చేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
కొన్ని నెలల క్రితం జలంత్రకోటలోని ఓ దాబా వద్ద బిల్లు కట్టలేదని లారీ డ్రైవర్‌ను అడిగినందుకు లారీతో ఢీకొట్టి దాబా ఓనర్‌ను(బెంగాల్‌వాసి), మరో వ్యక్తిని చంపేసిన సంగతి విధితమే.
సోంపేటలోని ఓ అంగన్‌వాడీ సెంటర్‌లో బెంగాల్‌వాసికి వరసకు మనవడు చదువుతున్నట్లు సిబ్బంది చెప్పారు.
మంత్రిస్తానని, జబ్బులు నయం చేస్తానని చెప్పే ఓ వ్యక్తి బరంపురంలో కొంతమందిని, మరికొందరు యువకులకు ఆశ్రయం కల్పించేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు సోంపేటకు చెందిన సామా జిక కార్యకర్త రవి చెప్పారు.
కొన్నాళ్ల క్రితం సోంపేటలోని ఓ కాలనీలో పదిమంది యువతులను బంధించారని.. అందులో ఓ యువతి తప్పించుకుని వచ్చిందని, నలుగురు ఆర్మీ యువకులు చూసి పూర్తిగా వివరాలు తెలుసుకునేలోపే ఆందోళనగా ఉన్న యువతి అక్కడి నుంచి వెళ్లిపోయిందని సమాచారం.
ప్రశ్నార్థకంగా మారిన భద్రత..
ఇటీవల పలాసలో పట్టపగలు దోపిడీ జరిగింది. వారికి స్థానికుల నుంచి సహకారం అందింది. దీంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. స్వయంగా ఎస్పీయే జిల్లాలోని అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పోగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


