‘స్వర్ణకార వృత్తిని బతికించండి’ | - | Sakshi
Sakshi News home page

‘స్వర్ణకార వృత్తిని బతికించండి’

May 20 2026 10:37 AM | Updated on May 20 2026 10:37 AM

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణకారులను ఆదుకోవాలని కంచి కామాక్షీదేవి శ్రీకాకుళ పట్టణ స్వర్ణకార సేవా సంఘం అధ్యక్షులు సోపింటి తారకేశ్వరరావు, సెక్రటరీ కడారి దుర్గాప్ర సాద ఆచారి, కోశాధికారి తాళాబత్తుల సర్యప్రకాష్‌, గౌరవాధ్యక్షులు సాతివిల్లి శ్రీనివాసరావు, అనుపోజు శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు. స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించాలని చంపాగల్లివీధిలో మంగళవారం బంద్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సంవత్సరం కాలం బంగారం ఎవరూ కొనవద్దని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం తగదన్నారు. ఈ ప్రకటన స్వర్ణకార వృత్తికి, స్వర్ణకార కుటుంబాలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఈ ప్రకటన వెనక్కి తీసుకోవాలన్నారు. తమ వృత్తిని బతికించడానికి ఆదుకోవాలని, సబ్సిడీ రుణాలు ఇప్పించి గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు. 50 ఏళ్లు దాటిన స్వర్ణకారులకు పింఛను ఇవ్వాలని, బ్యాంకు రుణాలు తక్కువ వడ్డీకి ఇప్పించాలన్నారు. కాంప్లెక్స్‌ లు నిర్మించి తక్కువ అద్దెకు ఇవ్వాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement