సారవకోట: జగన్నాథపురం గ్రామానికి చెందిన జేసీబీ ఆపరేటర్ బొమ్మాళి వెంకటేష్(23) మద్యానికి బానిసై మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారం మేరకు సోమవారం మద్యం షాపులో మద్యం సేవించి అక్కడి నుంచి పొలాల గుండా మండల పరిషత్ కార్యాలయానికి పక్కనే పొలాల్లో పడిపోయాడు. ఉష్ణోగత్ర అధికంగా ఉండటంతో పాటు మద్యం సేవించి ఉండడంతో నీరు అందక మృతిచెందాడు. సోమవారం ఇంటికి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మొల్ సిగ్నల్ ప్రకారం గాలించినా ఫలితం లేకపోయింది. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు మండల పరిషత్ వెనుకనున్న పొలాల్లో వెంకటేష్ మృతదేహం లభ్యమైంది. ఒకే ఒక్క కుమారుడు మద్యానికి బానిసై మృతి చెందడంతో తల్లిదండ్రులు తులసమ్మ, లక్ష్మినారాయణ భోరున విలపిస్తున్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాతపట్నం తరలించారు.


