● ఐపీఎల్‌లో సిక్కోలు బిడ్డ | - | Sakshi
Sakshi News home page

● ఐపీఎల్‌లో సిక్కోలు బిడ్డ

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

‘జీడి బోర్డు ఏర్పాటుచేయాలి’

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): రాష్ట్ర ప్రభుత్వం జీడీకి మద్దతు ధర ప్రకటించి జీడి బోర్డు ఏర్పాటు చే యాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక సీపీఎం కార్యాలయం సుందరయ్య భవన్‌లో సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడి రైతులు దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. జిల్లా సముద్రతీర ప్రాంతాన్ని అదానికీ కట్టబెట్టేందుకు ప్రభుత్వం పూనుకుందని అన్నారు. సముద్ర తీర ప్రాంతంలో రేర్‌ ఎర్త్‌ మిన రల్‌ పేరుతో తవ్వకాలు జరిగితే ప్రకృతి విధ్వంసం జరుగుతుందన్నారు. మే 19వ తేదీన సుందరయ్య వర్ధంతి సందర్భంగా జిల్లాలో అన్ని మండలాల్లో ర్యాలీలు, బహిరంగ సభలో నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఉపసంహరించుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement