● ఉచిత శిబిరాల నుంచి ఉన్నత స్థాయికి..
● వేసవి శిబిరాలకు హాజరై ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు
ఆర్ట్ టీచర్‌గా..
లాఫింగ్ క్లబ్ వేసవి శిబిరానికి వెళ్లి ఆర్ట్ టీచర్‌గా ఉద్యోగం సాధించిన మరో వనిత లోకనాథం దీప్తి. ఈమె కూడా తన చిన్నతనంలో లాఫింగ్ క్లబ్‌లో డ్రాయింగ్‌లో శిక్షణ పొంది, ఆ స్పూర్తితో కాకినాడలోని టీచర్ ట్రైనింగ్‌లో జాయిన్ అయి 2017లో ఆర్ట్ టీచర్‌గా ఉద్యోగం సాధించారు. తాను ప్రస్తుతం లాఫింగ్ క్లబ్‌లో వేసవి శిబిరానికి వచ్చే పిల్లలకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పుతున్నానని చెబుతున్నారు.
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలో ఏటా వేసవి శిబిరాలు నిర్వహించడం పరిపాటి. ఇందులో శిక్షణ తీసుకోవడం కాలక్షేపం మాత్రమే కాదు.. భవిష్య త్‌కు భరోసా కూడా. ఇక్కడ శిక్షణ పొందిన కొందరు విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకుని చక్కటి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.


