ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని, లేదంటే పోరాటం తప్పదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా ఆదివారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.భానుమూర్తి, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.దశరథుడు, జి.త్రినాథరావు, యూనియన్ ప్రతినిధులు ఎస్‌వీ రమణ, కె.బాబూరావు మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటాలకై నా సిద్ధమన్నారు.
–శ్రీకాకుళం అర్బన్


