ప్రయాణం.. ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం.. ప్రమాదం

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

టెక్కలి: టెక్కలి నుంచి ఎన్‌ఎం రోడ్డు మార్గంలో మూలపేట పోర్టుకు భారీ వాహనాలు ప్రమాదకరంగా వెళ్తూ ప్రాణాలు తీస్తున్నాయి. నిత్యం అధిక సంఖ్యలో వాహనాలు గ్రావెల్‌, ఇతర మెటిరీయల్‌ను రవాణా చేస్తున్నారు. అయితే కొన్ని వాహనాలు మరింత ప్రమాదకరంగా మెటీరియల్‌ను రవాణా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో పోర్టు వాహనాల వలన జరిగిన ప్రమాదాలే నిదర్శనం. పెద్ద పెద్ద రాళ్లను వాహనాల్లో తరలిస్తూ కనీసం నిబంధనలతో పాటు రక్షణ చర్యలు చేపట్టడం లేదు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని వాహనాలకు పూర్తిగా ఫిట్‌నెస్‌ లేకుండానే పరిమితికి మించి మెటీరియల్‌ను రవాణా చేస్తున్నారు. అధికారుల కళ్లు గప్పి ఇష్టారాజ్యంగా రవాణా చేస్తున్నప్పటికీ కట్టడి చర్యలు మాత్రం కనిపించడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement