గార: రకీడలతో మానసికోల్లాసంతో పాటు దేహదారుఢ్యం సొంతమవుతుందని శ్రీసత్యసాయి సేవాసంస్థల గార జోనల్ కన్వీనర్ బోర సింహాచలం మాస్టారు అన్నారు. ఆదివారం బోరవానిపేట పంచాయతీ తాళ్లవలసలో అసిరితల్లి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహపూర్వకమైన వాతావరణంలో పోటీలు జరగాలని ఆకాక్షించారు. నిర్వాహకులను అభినందిస్తూ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. తొలిరోజు చిన్నతోనంగి–సానివాడ జట్లు, పేర్లవానిపేట–దాసరివానిపేట, వెంకటాపురం–కొత్తపేట, కె.సైరిగాం–పెద్ద తోనంగి జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి. కార్యక్రమంలో టి.పమిడయ్య, కె.జగ్గారావు, కె.శేఖర్, కె.రాజారావు, నిర్వాహకులు టి.గుణ, ఎస్.శ్రీను, ఏ.దుర్గాప్రసాద్, గ్రామయువత పాల్గొన్నారు.


