శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నాగవంశ కులాన్ని బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చాలని నాగవంశ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో పట్టణ నాగవంశం సంక్షేమ సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. ముందుగా భీమిలి నియోజకవర్గం నాయకుడు గాడు అప్పలనాయుడు మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అనంతరం జిల్లా నాగవంశం సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మొఖర వెంకట మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా నల్లి రాజారావు, కోశాధికారిగా బోనాల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా మంగరాజు శంకర్, రాంబిల్లి నాగరాజు, సహాయ కార్యదర్శులుగా దుర్గాప్రసాద్, పొడుగు శ్రీను, జర్జాపు రాజారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనకాపల్లి రంగారావు, బోనీ రాజేశ్వరరావు, 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం డైరెక్టర్ మడ్డు రామారావు, పొడుగు శ్యాంసుందర్, మల్లిక సూర్యనారాయణ, నల్లి అప్పలనాయుడు, కొన్ని సూరి ప్రకాష్, నూకరాజు, పాతపట్నం, కోరసవాడ, కాగువాడ, చిలకపాలెం, పొందూరు, బుడుమూరు తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.


