ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

ఆత్మీయ సమ్మేళనం

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

నరసన్నపేటతో పాటు ఉర్లాంలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో 1984–85 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 40 ఏళ్ల తరువాత కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉర్లాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో 1997–98 టెన్త్‌ క్లాస్‌ బ్యాచ్‌ అపూర్వ కలయిక స్థానిక కల్యాణ మండపంలో జరిగింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించారు.

– నరసన్నపేట

Advertisement
 
Advertisement
Advertisement