ఇచ్ఛాపురం రూరల్: ఎమ్మెల్సీ నర్తు రామారావు జన్మదిన వేడుకలు ఆదివారం సందడిగా జరిగాయి. ఈదుపురం రామాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఎమ్మెల్సీ రామారావు వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సైనికుడిగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తనకు పార్టీ కార్యకర్తలు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, కంచిలి ఎంపీపీలు బోర పుష్ప, పైల దేవదాస్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు ఉప్పాడ నారాయణమ్మ, ఇప్పిలి లోలాక్షి, నాలుగు మండలాల ఎంపీటీసీ సభ్యులు, తాజా మాజీ సర్పంచ్‌లు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


